chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 6:58 am Digital Edition : CHITTOORE EXPRESS

మన్నారు పోలూరు దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 21:

 

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు. పోలూరు దర్గాలో రంజాన్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డాక్టర్ నిల్వలు విజయ్ శ్రీ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాన గుణం, సోదర భావానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అల్లా దీవెనలతో వర్ధిల్లాలని అల్లాను భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.