chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 8:21 am Digital Edition : CHITTOORE EXPRESS

మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలసిన చిత్తూరు ఎమ్మెల్యే దంపతులు

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 14:

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల్ జగన్ మోహన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాత్రి మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే గురజాల్ జగన్ మోహన్, సతీమణి గురజాల్ ప్రతిమలతో ఆప్యాయంగా మాట్లాడారు. మంగళగిరి చేనేత పట్టుచీరను గురజాల్ ప్రతిమకు అందజేశారు. సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కూడా ఎమ్మెల్యే గురజాల్ జగన్ మోహన్ పాల్గొన్నారు.చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ సమైక్యత, అభివృద్ధి చర్చలు ఆసక్తికరంగా సాగాయి.