
ఎస్.ఆర్.పురం, చిత్తూరు ఎక్స్ప్రెస్, సెప్టెంబరు 6:
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్తో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కొద్దిసేపు భేటీ అయ్యారు. నియోజకవర్గం, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన పనులపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి నారా లోకేష్ చిత్తూరు మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. వసంత్ కుమార్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.