భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రశాంతి నిలయం నుంచి బయలుదేరిన అఖండ జ్యోతి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తికి చేరుకుంది. బహదూర్ పేట భజన మందిరం వద్ద నుంచి ప్రారంభమైన అఖండ జ్యోతి ఊరేగింపు ఉప్పు వీధి, నాయుడు బిల్డింగ్స్ ప్రధాన వీధి, ముత్యాలమ్మ గుడి వీధి, నగరి వీధి, బజార్ వీధి, తేరు వీధి, నెహ్రూ వీధి మార్గాల గుండా ప్రయాణించి, చివరగా శ్రీ సత్యసాయి మందిరానికి చేరుకోనుంది. శుక్రవారం రాత్రి అఖండ జ్యోతి శ్రీకాళహస్తిలోని శ్రీ సత్యసాయి మందిరంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేయబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమం శ్రీ సత్య సాయి సేవ సమితి పాల్గొన్నారు .
