chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 6:29 pm Digital Edition : CHITTOORE EXPRESS

బ్రహ్మోత్సవాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయం శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్

చిత్తూరు ఎక్స్ ప్రెస్, శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తి ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన 220 మంది రోవర్లు, రేంజర్లు, స్కౌట్స్, గైడ్స్ సేవలందించారు. శివరాత్రి రోజున ఆలయంలోని క్యూ లైన్లలో భక్తులకు తగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించి, రద్దీని క్రమబద్ధీకరించేందుకు సహకరించారు. అలాగే స్వామి, అమ్మవార్ల రధోత్సవం, తెప్పోత్సవం, కళ్యానోత్సవాలలో కూడా తమ వంతు సేవలందించారు.ఈ సందర్భంగా కళ్యానోత్సవంలో పాల్గొన్న రేంజర్లు, రోవర్లు, స్కౌట్స్, గైడ్లను ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ కలసి మాట్లాడారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు విశేషమైన సేవలు అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం  జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు పర్యవేక్షణలో ఇంచార్జి కార్యదర్శి విజయకుమార్, స్కౌట్ మాస్టర్లు మహేంద్ర, అజారుద్దీన్, విద్యాసాగర్, సుబ్రహ్మణ్యం, ధనుష్, మణికంఠ, గైడ్ కెప్టెన్లు, జ్యోతిర్మయి, సరిత, నిర్మల,  రేంజర్, రోవర్ లీడర్లు నాయకత్వం వహించారు.