chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 5:54 pm Digital Edition : CHITTOORE EXPRESS

బోయనపల్లిలో వింత ఆచారం ఘనంగా స్మశానకొల్ల 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 17:

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బోయన పల్లిలో మహాశివరాత్రి పురస్కరించుకుని అమావాస్య రోజున అంగాల పరమేశ్వరి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చంద్రప్ప మాట్లాడుతూ… తమ పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం జాతర ఘనంగా జరుగుతుందని తెలిపారు. గ్రామ స్మశానంలో భారీ అమ్మవారి మట్టి ప్రతిమ ను ఏర్పాటు చేసి, ఆలయం నుండి ఉత్సవ విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి డప్పు, మంగళ వాయిద్యాలతో మహిళ భక్తులు పూపునకాలతో ఊగుతూ అంగరంగ వైభవంగా స్మశానకొల్లకు తీసుకెళ్లారు. స్మశానంలో అమ్మ వారి ప్రతిమకు జంతు బలులు ఇచ్చి రక్తపు అన్నం చేసుకుని పైకి విసరడం జరిగింది. చల్లిన రక్తపు అన్నాన్ని భక్తులు పట్టుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లడంతో దోషాలు తొలగుతాయని వారి విశ్వాసం. అమ్మవారి మట్టి ప్రతిమ ఎదురుగా చేతులు చాచి కూర్చున్న భక్తులకు పూజారులు కొరడాతో చెల్లు మనిపిచ్చరు దెబ్బలు తీర్చారు. కొరడాతో దెబ్బలు తినడంతో దోషాలు పోతాయని భక్తుల నమ్మకం. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు.