
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 30:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని మర్రిమాను వీధి ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని బూత్ నంబర్-168లో కొనసాగు తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము పరిశీలించారు. ఈ సందర్భం గా బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమీక్షించి,అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు,చేర్పులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపీనాథ్, బూత్ ఇన్‌చార్జ్ చంద్ర, రాజా, రాధా, బుజ్జి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.