chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:09 am Digital Edition : CHITTOORE EXPRESS

బీఎస్పీ పలమనేరు పట్టణ అధ్యక్షుడిగా శివకుమార్

పలమనేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29:

 

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) పలమనేరు పట్టణ అధ్యక్షుడిగా కంగుంది శివకుమార్‌ను నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వృత్తిరీత్యా న్యూస్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివకుమార్‌కు ప్రజా సమస్యలపై అవగాహన, సామాజిక బాధ్యత ఉన్నాయని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన శివకుమార్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పి. సురేంద్రబాబు, జిల్లా ఇన్‌చార్జ్ శివాజీ గోవింద్, పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జల్లి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. శివకుమార్ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.