chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:17 am Digital Edition : CHITTOORE EXPRESS

బిఆర్‌డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో         మెగా ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరానికి విశేష స్పందన

 

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 07:

 

 

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బిఆర్‌డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం కుప్పంలోని బిఆర్‌డీ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ శిబిరాన్ని బెంగళూరులోని నోవా ఫెర్టిలిటీ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిఆర్‌డీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వైద్య శిబిరంలో నోవా ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ లావణ్య, బీఆర్‌డీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హరిత మండవ ప్రత్యేక వైద్య సేవలు అందించారు. శిబిరానికి మొత్తం 82 మందికి పైగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. పరీక్షల అనంతరం ఐవీఎఫ్ చికిత్సకు అనువుగా ఉన్న 18 మంది దంపతులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వైద్య సలహాలు, చికిత్సా విధానాలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. బిఆర్‌డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతి నెల రెండో ఆదివారం నిర్వహించే సంతాన సాఫల్య వైద్య శిబిరం ద్వారా చికిత్స పొందే దంపతులకు ఐవీఎఫ్, ఐయూఐ చికిత్సా ప్యాకేజీలపై ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో పాల్గొన్న దంపతులు వైద్య నిపుణుల సేవలను అభినందిస్తూ, ఇటువంటి శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.