chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 10:25 am Digital Edition : CHITTOORE EXPRESS

బాల్ బ్యాడ్మింటన్లో దర్శ్ అకాడమీ చిన్నారులు విజయం

తొట్టంబేడు మండలం దర్శ్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన చిన్నారులు సోమవారం తిరుపతిలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం నిర్వహించిన జిల్లా సెలెక్షన్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచారు. అండర్-11 సింగిల్స్ విభాగంలో దీక్షిత్ రన్నర్ అప్ స్థానాన్ని సాధించాడు. అండర్-11 డబుల్స్ విభాగంలో దీక్షిత్ , భారత్ రన్నర్-అప్ స్థానాన్ని సాధించారు. ఈ విజయాలతో ఇద్దరూ రాబోయే స్టేట్ మీట్కు అర్హత సాధించారు. చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో తన అంకితభావం, కృషి చూపిన కోచ్ పవన్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.