chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:23 am Digital Edition : CHITTOORE EXPRESS

బాలింతలు, శిశువులకు ఉచిత రవాణా

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక వాహనాన్ని మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చారు.స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జీ. విజయకుమార్ నాయుడు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో కలిసి వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను ఉచితంగా, సురక్షితంగా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత రవాణా సేవలతో పాటు ఇతర వైద్య సదుపాయాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రి కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.