chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:46 am Digital Edition : CHITTOORE EXPRESS

బడీ పిలుస్తోంది” ర్యాలీ నిర్వహణ

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్02

 

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో “బడీ పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి చిన్నారికి విద్య హక్కు అందేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమా న్ని చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్న ఈ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. పాఠశాల వయస్సు గల ప్రతి బాలబాలికను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి చిన్నారి విద్యాభ్యాసం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన,నిరక్షరాస్యత నిర్మూల న కోసం ప్రతిఒక్కరూ బాధ్యతాయుతం గా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పాఠశాలకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి విద్యాబాట పట్టించేందుకు అందరూ సహకరించాలని సూచించారు. ర్యాలీలో విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.