
పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:
ఫాదర్స్ డే సందర్భంగా పెనుమూరు మండలం చింతపెంట పంచాయతీ పరిధిలోని చిన్న నడుంపల్లె గ్రామంలోని హరే రామ హరే కృష్ణ వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “నాన్నకు వందనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, జీడీ నెల్లూరు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆశ్రమం లో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు, తువ్వాళ్లు, బ్రెడ్‌లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దలను గౌరవించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ యుగంధర్ పొన్న పేర్కొన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, చిప్పర పల్లె రమేష్,నాగరాజు,సోము,ముత్తు,చంద్రబాబు కుటుంబ సభ్యులు,ఆశ్రమ పెద్దలు,జనసేన పార్టీనాయకులు పాల్గొన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.