chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 9:21 pm Digital Edition : CHITTOORE EXPRESS

ప్రియుడితో కలిసి భర్త హత్య భార్యతో పాటు ప్రియుడు అరెస్ట్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 30:

 

ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడిని కుప్పం పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సిఐ శంకరయ్య తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, కుప్పం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోట్లచేను గ్రామానికి చెందిన బాలరాజు తన భార్య సూర్యతో కలిసి నివసించేవాడని, ఈ క్రమంలో సూర్య, తిరుపతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త పలుమార్లు వారిని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఐతే భర్త తమ అక్రమ సంబంధానికి అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన సూర్య, తన ప్రియుడు తిరుపతితో కలిసి హత్యకు కుట్ర పన్ని, ఈ నెల 12వ తేదీ రాత్రి బాలరాజు నిద్రలో ఉండగా కత్తులతో దాడి చేసి హత్య చేసి, అక్కడి నుంచి పరారైనట్టు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపి నిందితులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ విచారణలో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు మోట్లచేను బస్ స్టాప్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.