chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 8:02 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రియా నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సుధీర్ జన్మదిన వేడుకలు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 12:

 

కుప్పం పట్టణానికి చెందిన ప్రియా నర్సింగ్ హోమ్ అధినేత, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు, అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సేవలు, హస్తవాసి కలిగిన తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తూ పేద ప్రజలను ఆదుకుంటున్న సేవలను గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు. వైద్య రంగంలో చేసిన సేవలను ప్రశంసిస్తూ పేదలకు అందుబాటులో వైద్య సేవలు అందించడంలో చూపుతున్న నిబద్ధత ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.