chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:37 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రసన్న పెద్దపులి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభం

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్02:

 

చిత్తూరుజిల్లా కుప్పంనియోజకవర్గం శాంతిపురంమండలం రాళ్లబూదుగూరు గ్రామంలో వెలసిన ప్రసన్నపెద్దపులి గంగ మ్మదేవాలయ వార్షికబ్రహ్మోత్సవాలు మంగళవారం అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజలు, భక్తుల నడుమభక్తిశ్రద్ధలతో నిర్వహించిన జాతర ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.ఉదయం 8గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమ య్యాయి. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వ హించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పాలకుండలతో గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించడంతో జాతర ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.మధ్యాహ్నం రెస్కో డైరెక్టర్ ఎస్.బసవ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జాతరకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదం అందజేసి సేవాకార్యక్రమాన్ని చేపట్టారు. జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి ప్రత్యేక దీపారాధన, పొంగళ్ల సమర్పణ,ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు ఆలయ నిర్వాహకు లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు దాతలు భరత్, నాగేంద్ర సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా భక్తుల ఆకర్షణ కోసం బాణాసంచా ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ను యూనిట్ ఇన్‌చార్జి ఆర్‌.ఎస్‌. మణి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. జాతర ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నా రని, భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.