chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:53 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రమోషన్ సమస్య పరిష్కారానికి సహకరించిన  విలేకరులకు విద్యుత్ శాఖ కార్మికుల కృతజ్ఞతలు

చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 31:

 

చిత్తూరు రూరల్ విద్యుత్ శాఖలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ సమస్య పరిష్కారానికి సహకరించిన పత్రికా విలేకరులందరికీ విద్యుత్ శాఖ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.., తమ సమస్యను వార్తల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరులు చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మీడియా సహకారం వల్లే ప్రమోషన్ సమస్య సానుకూలంగా పరిష్కారమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తోడ్పాటునందించాలని పత్రికా మిత్రులను కోరారు. ఈ మేరకు చిత్తూరు రూరల్ విద్యుత్ శాఖ కార్మికులు పేరుపేరునా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు.