chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 11:07 pm Digital Edition : CHITTOORE EXPRESS

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 14:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సమస్యలు, రహదారి మరమ్మతులు, పింఛన్లు, గృహ నిర్మాణం, రేషన్ కార్డులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా శ్రద్ధగా విన్న నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించడంతో పాటు, మిగిలిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.