chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 8:55 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రభుత్వ వసతి గృహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించి విద్యార్థినులతో నేరుగా
మాట్లాడి వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరఫున విద్యార్థినులకు ఉచితంగా బ్లాంకెట్లు, దుప్పట్లు, షూస్ పంపిణీ చేసినట్లు తెలిపారు. హాస్టల్‌లో ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డుల కొరత ఉందని విద్యార్థినులు తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అప్పటికప్పుడే ఫ్యాన్లు, బ్లాక్‌ బోర్డులను అందజేసి అవసరమైన సదుపాయాలు కల్పించారు.  వసతి గృహాల్లో నివసిస్తున్న పేద విద్యార్థినులకు ఎలాంటి లోటు లేకుండా, వారి విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఖాదర్, ప్రసాద్ పలువురు నాయకులు పాల్గొన్నారు.