chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:10 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకం…  యాక్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రదీప్  భానోదయ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి13:

 

 

ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే వారి జీవితం ఓ కొత్త బంగారులోకంలా ఉంటుందని యాక్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ కె.వి ప్రదీప్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టేరి భానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ యాక్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రదీప్ సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా యాక్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే సేవాభావంతో మెలగాలని తెలిపారు అలాగే స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సలహాలు సూచనలు అందించారు అనంతరం డిఇఓ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తును ఎంచుకోవాలని విద్యార్థులకు సలహాలు సూచనలు అందించారు రానున్న పదవ తరగతి పరీక్షల్లో బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు అలాగే పాఠశాల సముదాయంలో అక్కడ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఆప్యాయంగా స్వాగతం పలికిన విధానం అందరిని ఆకట్టుకుంది… అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సంబరాలు అంబరాన్ని అంటాయి… అలాగే ప్రస్తుత సమాజంలో భక్తి పైన స్కిట్లు అలాగే రైతుల పైన స్కిట్లు, పేదరికం పైన స్కిట్లు అందరిని ఆకట్టుకుంది అలాగే వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పాఠశాల కరస్పాండెంట్ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ లావణ్య అందించారు అలాగే కరస్పాండెంట్ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ లావణ్య ను యాక్టర్ ప్రదీప్ సరస్వతి కలిసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మౌనిక,కీర్తి ,భారతి ,కామేశ్వరి, షర్మిల,మోహన, కవిత,దుర్గా, జగదా,విజయలక్ష్మి, వందన ,లక్ష్మి, కోమల హేమాంజలి,దివ్య, వందన, తదితరులు పాల్గొన్నారు.