chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 4:09 am Digital Edition : CHITTOORE EXPRESS

పోలీసుల అవగాహన సదస్సు.. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ: డీఎస్పీ పార్థసారథి

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 28:

 

చిత్తూరు జిల్లా పోలీసు ఎస్.పి తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో గుడుపల్లి మండలం సంగనపల్లిగ్రామంలో ఆదివారం పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, గుడుపల్లి ఎస్‌ఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన పోలీసులు మహిళలు,బాలల భద్రత,సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ధైర్యస్పర్శ యాప్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.సీఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో 112కు, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరిం చాలని, నేరాలనియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులుకోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామపెద్దలు,మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.