chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:01 pm Digital Edition : CHITTOORE EXPRESS

పేద చిన్నారులతో వివాహ వార్షికోత్సవ వేడుక

 

హిందూపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే18:

 

 

హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో ఉన్న మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి బడి విద్యార్థుల మధ్య మున్సిపల్ కమిషనర్ సుగుణ మల్లికార్జున దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు తీపి వంటకాలతో భోజన వసతి ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించి అన్నదానం చేశారు. నిర్వాహకులు సాయికళ, మాళప్ప దంపతులు మాట్లాడుతూ ఉచిత వేసవి బడి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు సహాయం అందించిన కమిషనర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు కమిషనర్ దంపతులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కమిషనర్ దంపతులు విద్యలో ముందుండాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల మధ్య కొంతసేపు గడపడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు కమిషనర్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయికళ, మాళప్ప, దయానంద్, శ్రీశైలం, రాజు, సాయి, గణేష్, కుమారి, మమత, గాయిత్రి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.