chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 6:33 am Digital Edition : CHITTOORE EXPRESS

పేదల చిరునవ్వే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నదన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రాకతో జీడి నెల్లూరు అభివృద్ధి బాట 

ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 01:

 

పేదల కళ్ళల్లో చిరునవ్వే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు మండలంలో పాతపాళ్యం పాచిగుంట పంచాయతీ లో పలు సిసి రోడ్లు ,నూతన బోరు , గ్రామ స్వర్ణ సచివాలయాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం తరువాత అభివృద్ధి పనులను జరిగిన నియోజకవర్గ జీడి నెల్లూరు అని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో గుంతలమైన రోడ్లను పూడ్చలేక పోయారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రామాలకు సిసి రోడ్లను వేసినా ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, పెనుమూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణమనాయుడు, ఎంపీడీవో మనోహర్ గౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు,జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ ,జిల్లా నాయకులు రాజశేఖర్ నాయుడు, పాలసముద్రం మండల అధ్యక్షుడు శివ, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుగు పూర్ణిమ బాబు, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాదన్, దివంగత నేత జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మనోహర్ నాయుడు తనయరాలు శిల్ప, రఘునాథ నాయుడు, స్థానిక సర్పంచ్ అనసూయమ్మ, యువ నాయకుడు హరీష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి కోదండ రెడ్డి,పీఏసీ చైర్మన్ మోహన్ నాయుడు, నాయకులు వెంకటేష్ యాదవ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చందు, సుధా నాయుడు, దేవపత్ని ధనుంజయ నాయుడు, కుప్పయ్య, నాగరాజు ,నవీన్ చౌదరి , నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.