chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 7:59 am Digital Edition : CHITTOORE EXPRESS

పెరుమాళ్లపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,అక్టోబర్ 02:

 

వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామసభ నిర్వహించారు. గ్రామ సచివాలయ కార్యదర్శి ధనంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి చర్చించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి శశి ఆనందరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు బోడి రెడ్డి, రెడ్డివారి ఎర్రంరెడ్డి, గాలం చంద్రశేఖర్, బండి సుధాకర్ రెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ రూపేష్, ఫీల్డ్ అసిస్టెంట్ వాసు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.