chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 8:38 pm Digital Edition : CHITTOORE EXPRESS

పెనుమూరులో స్వచ్ఛ రథం ప్రారంభం గ్రామాల్లో పారిశుధ్యానికి నూతన దిశ

పెనుమూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:

స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెనుమూరు మండలంలో స్వచ్ఛ రథాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ రథం ద్వారా ప్రజల ఇండ్లవద్ద నుండి పొడి చెత్తను సేకరించి, అందుకు సమాన విలువ కలిగిన అవసరమైన సరుకులను అందజేయనున్నారు. ఈ విధానంతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడి, పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శి భాస్కర్, పరమేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో,ఎంఆర్ఓ,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించి, పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.