
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్09:
పెంచిన పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నేడు రేణిగుంట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్మికులు,వామపక్ష పార్టీ నాయకులు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఇంధన ధరలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ రేణిగుంట మండల కార్యదర్శి వైయస్ మణి మరియు సిపిఎం మండల కన్వీనర్ కొండ్రెడ్డి హరి నాథ్ లు మాట్లాడుతూ.. పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదల వల్ల పేద, మధ్యతరగతి ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారిందన్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరిం చుకుని సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్తీక్ సుబ్బరాజు రమణ భాను,సిపిఎం నాయకులు వెంకటరమణ, శివానందం,దీప,సత్యశ్రీ, ఈశ్వరమ్మ,దిలీప్, భాషా,భారతి, ముని స్వామి,గురుమూర్తి,హరి,వెంకటేష్, పద్మమ్మ,చీరాలమ్మ,సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు,కార్మిక సంఘాల ప్రతినిధులు,మహిళలు,యువజనులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.