chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 7:50 am Digital Edition : CHITTOORE EXPRESS

పెంచిన ఇంధన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి:  సీపీఐ

 

పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్09:

 

పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరల పెంపు తో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ, పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టి.ఎల్.వెంకటేష్ విమర్శించారు. వామపక్ష పార్టీల రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం పీలేరులో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సమయంలో ఇంధన ధరలను పెంచడం ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోకపోతే సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యురాలు పెద్దిరెడ్డి కవితారెడ్డి, సీపీఐ నాయకులు పి.వి. రమణ, బోయకొండ,దాము,రఘునాథరెడ్డి, సురేష్,జయచంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు.