
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 25:
పులివెందులలో జరిగిన ఓ ఆత్మీయ కలయిక పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు పలువురు పాత మిత్రులు,అభిమానులు ఒకేచోట కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం నుంచి సక్రియంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వైసిపి నాయకుడు కే. గణేష్ అక్కడికి చేరుకుని తన పాత మిత్రులతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఆనందా న్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. “అన్నా బాగున్నావా? కుప్పంలో అంతా ఎలా ఉంది?” అని అడగగా, “బాగున్నాం అన్నా.. మిమ్మల్ని కలవాలని వచ్చాను” అంటూ గణేష్ స్పందించినట్లు తెలిసింది. ఈ కలయికలో రాజకీయాలకు అతీతంగా స్నేహబంధాలు,మానవ సంబంధాలు ప్రధానంగా కనిపించాయని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం, ఆప్యాయత కొనసాగడం సమాజానికి మంచి సందేశమని పేర్కొన్నారు. పాత మిత్రుల పునర్మిళనం సందర్భంగా అనేక జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాల్గొన్న వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఆత్మీయ సమావేశం అక్కడి వారిలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.