chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 2:41 pm Digital Edition : CHITTOORE EXPRESS

పిల్లలకు నులిపురుగుల నివారణ కార్యక్రమం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 17:

పిల్లలఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి నులిపురుగుల నివారణకు స్పందించాలని పిలుపునిచ్చిన ఏఎన్ఎం కల్పన ఆధ్వర్యంలో కుప్పంమండలం మోడల్ కాలనీలోని శ్రీసాయి బాబా స్కూల్‌లో కరస్పాండ్ రవికుమార్ మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణకార్యక్రమం నిర్వహించారు. ఒకటి నుండి పందొమ్మిది సంవత్సరాల పిల్లలకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు శాంతి, శశికల ప్రధానంగా పాల్గొన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు యాస్మిన్,రజియా,అఖిల, విద్యార్థులు, ఇతరులు సహకరించారు. నులిపురుగుల వల్ల పిల్లల ఆరోగ్యం ప్రభావితమవుతోందని, ఈ కార్యక్రమం ద్వారా అవి పూర్తిగా నివారించవచ్చని ఏఎన్ఎం కల్పన తెలిపారు.