కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి08:
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది సమీపంలోని పాలారు నది ఒడ్డున ఉన్న చెక్‌డ్యాంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. స్థానికులు గమనించి కుప్పం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. మృతదేహం గుర్తు తెలియకపోవడంతో దాని గుర్తింపు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే కుప్పం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్ 9440900733 అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.