
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, సెప్టెంబర్ 25:
కుప్పం పట్టణంలోని నేతాజీ రోడ్డులో ఉన్న రాబర్ట్సన్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్వో మంచినీటి ప్లాంట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యం, భద్రత కోసం సీసీ కెమెరాలు అవసరమని స్కూల్ చైర్మన్ రాధా కోరగా, దాతలు స్పందించి వెంటనే వాటిని ఏర్పాటు చేయించారు. మాజీ సర్పంచ్ మమతా గోపీనాథ్ సహకారంతో ఆర్వో ప్లాంట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ సహకారంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల అవసరాలను గుర్తించి స్పందించిన దాతలను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో వన్నికుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ కె.ఎం. వేణుగోపాల్, 20వ వార్డు బూత్ ఇన్చార్జ్ కే. లోకేష్ బాబు, స్కూల్ వైస్ చైర్మన్ వరలక్ష్మి, గంగమ్మ డైరెక్టర్ శారదమ్మ, మల్లయ్య నాయుడు, శశికళ, ప్రసాద్, శ్రీకాంత్, వికేం రాజా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.