chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 12:35 pm Digital Edition : CHITTOORE EXPRESS

పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాం – మిద్దెల హరి, సత్రవాడ ప్రవీణ్

శ్రీకాళహస్తి
వైకాపా పార్టీలో  ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ మరియు ఆక్కో స్టేట్ డైరెక్టర్ గా , శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గా విధులు  నిర్వహించిన, మిద్దెలహరి వైకాపా   పార్టీకి రాజీనామా చేసి మరియు శ్రీకాళహస్తి మాజీఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కుమారుడు సత్రావాడ ప్రవీణ్   తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈనెల 25వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైకాపాతీర్థం పుచ్చుకున్నారు,
ఈ సందర్భంగా మిద్దెలహరి సత్రవాడ ప్రవీణ్ లు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వైకాపా పార్టీలో మాజీ ఎమ్మెల్యే  బియ్యపుమధుసూదన్ రెడ్డి చుట్టూ ఉన్న కొన్ని దుష్టశక్తులు పెట్టిన ఇబ్బందులకు తాను వైకాపా పార్టీని విడనాడి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆశయాలకు ఆకర్షితుడై జనసేన పార్టీలో చేరానని తెలియజేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమినాయకులతో  జనసేనలోని   సీనియర్ నాయకులతో కలిసి రానున్న స్థానిక ఎన్నికల్లో పనిచేస్తామన్నారు ..త్వరలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామని ,ఇందులో వైకాపా పార్టీకి చెందిన అనేకమంది కార్యకర్తలు నాయకులు జనసేనపార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆయన ఆలోచనలు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకుంటూ ఆయన ఒక తూఫాన్ అని ఆయన చేసే ఆలోచనలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఆమోదయకంగా ఉంటాయని తెలియజేయడం, ప్రపంచ చరిత్రలో ఇది గొప్ప విషయమని అలాంటి నాయకుని అడుగుజాడల్లో తాము నేటి నుంచి నడవడం తమకే ఎంతో అదృష్టమని తెలియజేశారు.