శ్రీకాళహస్తి చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ కార్యక్రమానికి సన్నద్ధమయ్యాయి. ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, చేజర్ల మండల టీడీపీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించనున్న 3.0 పల్లె పండుగ మహాసభకు మండలం నుంచి భారీగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ మహాసభకు చేజర్ల మండలంలోని 26 పంచాయతీలు, 36 గ్రామాల నుంచి 45 బస్సుల్లో సుమారు 2,100 మంది టీడీపీ కార్యకర్తలు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ మేరకు కార్యకర్తల తరలింపు కోసం సిద్ధం చేసిన జాబితాను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, చేజర్ల మండల స్పెషల్ అబ్జర్వర్ మాసారపు సుబ్బయ్య, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ డైరెక్టర్ మిన్నల రవి పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
