chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 12:35 pm Digital Edition : CHITTOORE EXPRESS

పర్యావరణ పరిరక్షణకు లయన్స్ క్లబ్ వినూత్న కార్యక్రమం 200 పర్యావరణహిత వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ

కుప్పం,

చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 14:

 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు 200 పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను ప్రజలకు అందజేశారు. వినాయక నవరాత్రుల అనంతరం విగ్రహాల నిమజ్జనం కారణంగా నీటి వనరులు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని క్లబ్ సభ్యులు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పర్యావరణహిత విగ్రహాల వినియోగంతో ప్రకృతిని కాపాడటమే కాకుండా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు అభినందిస్తూ పర్యావరణహిత వినాయక విగ్రహాలను స్వీకరించారు. “మట్టి వినాయకుడు.. పర్యావరణానికి మేలు, భవిష్యత్తుకు భరోసా” అనే సందేశంతో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.