chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 7:58 am Digital Edition : CHITTOORE EXPRESS

పరమసముద్రం గురుకులంలో హాకీ క్రీడాకారులకు కిట్ల పంపిణీ రూ.3.25 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల హాకీ టర్ఫ్‌ ఏర్పాటు: కడ పీడీ వికాస్‌ మర్మత్‌

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 06:

 

పరమసముద్రంలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో హాకీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు SAAP ఆధ్వర్యంలో బుధవారం హాకీ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి KADA ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ ఐఏఎస్‌, SAAP డైరెక్టర్‌, మాజీ భారత హాకీ క్రీడాకారిణి రాజని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస్‌ మర్మత్‌ మాట్లాడుతూ.. పరమసముద్రం గురుకుల పాఠశాలలో త్వరలో రూ.3.25 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ టర్ఫ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో హాకీ టర్ఫ్‌ ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు పేర్కొన్నారు. అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి వస్తే క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నరు. మాజీ భారత హాకీ క్రీడాకారిణి రాజని మాట్లాడుతూ విద్యార్థులు SAAP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాకీ కోచింగ్‌ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో సాధన చేయాలని సూచించారు. కుప్పం ప్రాంతం నుంచి భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లేశ్వరి, సీనియర్‌ హాకీ కోచ్‌ ప్రసన్నకుమార్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మహేష్‌, కౌన్సిలర్‌ గణపతి, స్థానిక నాయకులు ప్రతాప్‌, మురుగేష్‌, లోకేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాణ్యమైన క్రీడా పరికరాలు, మెరుగైన శిక్షణా సదుపాయాలు అందుబాటులోకి రావడంపై క్రీడాకారులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.