
పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్0 9:
పీలేరు మండల కురుబ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పురస్కార సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఐఎంఎల్ విద్యాధికారి కోట లీలారాణి, జూనియర్ లెక్చరర్ డాక్టర్ రోజారాణి పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి సమాజానికి గర్వకారణంగా నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్‌లో 900కు పైగా మార్కులు సాధించిన 8 మంది విద్యార్థు లకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రతిభా పురస్కారాలతో సన్మానించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని మరింత కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అతిథులు ఆకాంక్షించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కురుబ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కలకడ మాజీ ఎంపీపీ కాంతారావు, రఘు, జనార్దన్ గౌడ్, శివ, పీలేరు మండల అధ్యక్షుడు వసంతరాజా, ప్రధాన కార్యదర్శి హితేష్, శివశంకర్, రెడ్డప్ప, మిలిటరీ రమణబాబు, రిటైర్డ్ ఎస్‌ఐ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.