శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,28:
శ్రీకాళహస్తి పత్రికా స్వేచ్ఛ పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యానికి సమాధి కట్టడమేనని. పలువురు జర్నలిస్టులు అన్నారు. చిత్తూరు జిల్లాలో వీకోట వద్ద ఆంధ్రజ్యోతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని దుండగులు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ విలేకరులు శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి నాలుగు మాడవీధుల నందు నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో వీకోట వద్ద ఆంధ్రజ్యోతికి చెందిన సీనియర్ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని దుండగులు జరిగిన హత్య దాడిని జర్నలిస్టులు ఖండించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో మూలస్తంభమైన పత్రికా స్వేచ్ఛను పాలకులు హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. అనంతరం శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు వన్ టౌన్ సిఐ ప్రకాష్ కు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వినతిపత్రం అందజేశారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి విలేకరి హత్యకు పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు సిగ్గుచేటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాల్సిన మార్గాలు చాలా ఉన్నాయని అలా కాదని దుర్మార్గమైన, దురహంకారమైన ఆలోచనలతో తోటి మనిషిని చంపడం బాధాకరమన్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోటి విలేకరి చనిపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కార్తీక్ నాయుడు,ప్రెస్ క్లబ్ పీఆర్ఓ ఈశ్వర్, కామేష్,యాసిన్,చాన్ బేగం,చంద్రశేఖర్,జూమ్లేష,రమేష్ బాబు,హరిబాబు, శివ,చక్రపాణి, ధనశేఖర్,హకీం,బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.