chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 8:44 am Digital Edition : CHITTOORE EXPRESS

పచ్చరొట్ట ఎరువులతో భూసారం పెంపు

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 02:

 

రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచు కుని రైతులు భూముల సారవంతత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వ్యవసా య అధికారి అపోజి సూచించారు. పచ్చరొట్ట ఎరువుల వినియోగం ద్వారా భూసారం పెరగడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వి.కోటమండలంలో నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు తమ పొలాల్లో జీలుగ, జనుము వంటి పచ్చరొట్ట పంటలను సాగు చేసి పూత దశలో కలియదు న్నడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నేల సారవంతంగా మారు తుందని వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకం గా 13క్వింటాళ్ల జీలుగ,7 క్వింటాళ్ల జనుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందుబాటులో ఉంచిందన్నారు. ఒక ఎకరానికి 10నుంచి 15 కిలోల విత్తనం అవసరమవు తుందని,రైతులు రాయితీ ధరపై కిలోకు రూ.80 చెల్లించి పొందవచ్చని తెలిపారు. విత్తిన 45 రోజుల తర్వాత పూత దశలో ఉన్న పచ్చరొట్టపంటను కలియదున్నడం ద్వారా భూసారం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.సేంద్రియ ఎరువుల వినియోగంవల్ల నేల ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘ కాలికంగా అధికదిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నా రు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో వివరాలు నమోదుచేసుకుని రాయితీ విత్తనాలను పొందవచ్చని సూచించారు. రసాయన ఎరువులపై ఆధార పడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులవైపు మొగ్గు చూపా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ డైరెక్టర్ రంగనాథ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబాబు, ఈశ్వర్, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డైరెక్టర్ గజేంద్ర, సొసైటీ బ్యాంకు చైర్మన్ నారాయణస్వామి, రైతులు పాల్గొన్నారు.