కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 11:
భారతీయ జనతాపార్టీ సిద్ధాంతకర్త, మహానేత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కుప్పంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుప్పం బీజేపీ ఇంచార్జ్ తులసీనాథ్ మాట్లాడుతూ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన అంత్యోదయ మరియు ఏకాత్మ మానవవాదం సిద్ధాంతాలు దేశ రాజకీయాలకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న ఆయన భావజాలాన్ని ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు ఇంద్రకుమార్, పలని అంజికుమార్, జగదీష్, వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ, దీనదయాళ్ ఉపాధ్యాయ జీవితం యువతకు ఆదర్శమని కొనియాడారు. ఆయన త్యాగం, క్రమశిక్షణ, జాతీయతా భావం దేశ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు.