chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 12:02 pm Digital Edition : CHITTOORE EXPRESS

నెమలి ఈకపై తిరుమలేశుడు.. అబ్బురపరిచిన చిత్రకారుడి ప్రతిభ

 

శాంతిపురం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్,సెప్టెంబర్ 21:

 

నెమలి ఈకపై తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని అత్యంత సున్నితంగా చిత్రించి రాళ్లబూదుగూరు గ్రామానికి చెందిన చిత్రకారుడు బి.ఎం. సురేష్‌కుమార్ అందరినీ అబ్బురపరిచారు. ఎంతో సున్నితమైన నెమలి ఈకపై స్వామివారి రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో ఆయన కళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్వతహాగా చిత్రకారుడైన సురేష్‌కుమార్ ఇప్పటికే పలు చిత్రాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. భక్తి, కళాత్మకతను మేళవిస్తూ నెమలి ఈకపై శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని రూపొందించడంపై గ్రామస్తులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని వినూత్న చిత్రాలను రూపొందించి తన ప్రతిభను చాటాలని వారు ఆకాంక్షించారు.