
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,ఆగస్టు29:
జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరిం చుకుని కుప్పంలోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాల,పరమాటం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థులు శనివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులు క్రమశిక్షణతో ఒకచోట చేరి హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ ఆకృతిని రూపొందించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయన క్రీడా సేవలను స్మరించుకున్నారు. నిర్వా హకులు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్లు గుణ, సవిత, విజయ్, లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్, అధ్యక్షుడు సెల్వం, డైరెక్టర్ జయరాం నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.