chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:51 am Digital Edition : CHITTOORE EXPRESS

దివ్యాంగులకు శ్రీవారి దర్శన కార్యక్రమం   108మందికి ప్రత్యేక ఏర్పాట్లు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 75 మంది దివ్యాంగులు,24 మంది వాలంటీర్లు, 9 మంది నిర్వాహకులు కలిపి మొత్తం 108 మందికి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు వైద్య శాంతారామ్ తెలిపారు. చుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తిరుమలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సును ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.