chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:13 pm Digital Edition : CHITTOORE EXPRESS

దాడి చేసి కులదూషణకు పాల్పడ్డారంటూ బాధితుడి ఫిర్యాదు నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి వినతి

కుప్పం,న్యూస్, జూన్ 06:

 

గుడుపల్లి మండలం కుప్పేగానపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చాముండి నగర్ ఎస్సీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి పై దాడి చేసి కులదూషణకు పాల్పడిన విషయమై డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు వెంకటేష్ తనపై జరిగిన ఘటనకు తనపై జరిగిన దాడిని అధికారులకు వివరిస్తూ, న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. జూన్ 4న మధ్యాహ్నం సమయంలో దాసుమాకనపల్లి మార్గంలోని ఎర్రబీడ్ల సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న తనకు సాయి అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తన వాహనాన్ని ఆపమని కోరినట్టు తెలిపారు. వాహనం ఆపిన తనను అత్యవసరంగా గ్రామం వద్ద దింపాలని కోరిన సాయితో మాట్లాడుతుండగానే అక్కడికి మరికొందరు వ్యక్తులు వచ్చారని, వారిని చూసిన సాయి అక్కడి నుండి పారిపోవడం జరిగిందన్నారు. అంతటితో అక్కడికి చేరుకుంటా వ్యక్తులు తనను ఏ మాత్రం విచారించకుండా, విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. తల, ముఖ భాగాలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. దాడి సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు ప్రాణహాని కలిగించేలా బెదిరించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోగా, ఆ మార్గంలో వెళ్తున్న కొంతమంది తనను గుర్తించి, అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పలు కుట్లు పడ్డాయని, దాడికి పాల్పడిన వ్యక్తుల వల్ల తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వెంకటేష్, సంబంధిత వ్యక్తులను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరడం జరిగిందన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తులలో నూరుల్లా, ధీలు భాష, సాదిక్ భాషా, ముజుల్ల లు ఉన్నట్టు బాధితుడు తెలిపారు.