chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 9:18 am Digital Edition : CHITTOORE EXPRESS

దళితులపై దాడులు పెరిగాయని విమర్శించిన గంధమనేని 

ఎస్‌.ఆర్‌.పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే19:

 

వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్య రాజకీయాలు పెరిగాయని ఎస్‌.ఆర్‌.పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు విమర్శించారు. మంగళవారం కటికపల్లి పంచాయతీలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంధమనేని జయశంకర్ నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు. దళితులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం హత్య రాజకీయాలను ప్రోత్సహించిందని విమర్శించారు. తనపై కూడా గత ప్రభుత్వ కాలంలో అనేక కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలిపారు. మాట్లాడినా కేసులు, గ్రామాల్లో తిరిగినా కేసులు పెట్టి ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, సహకార సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వర్గ బాధ్యుడు బాబు నాయుడు, నియోజకవర్గ ఎస్సీ విభాగం కార్యదర్శి కుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తరుగు పూర్ణిమ బాబు, మాజీ ఎంపీటీసీలు వేమన నాయుడు, కేఎం రవి, మాజీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శేఖర్, ప్రసాద్, నరేష్, ఉదయ్, జలంధర్ నాయుడు, వెంకటరమణ, మాజీ యువత అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి, నోమేష్ రెడ్డి, త్యాగరాజు నాయుడు,జగదీష్ నాయుడు, బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.