chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:59 am Digital Edition : CHITTOORE EXPRESS

తిరుపతి విమానాశ్రయంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం… యోగా దినోత్సవంలో పాల్గొన్న ఎఎఐ,సిఐఎస్ఎఫ్ అధికారులు

 

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 21:

 

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి విమానాశ్రయంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విమానాశ్రయానికి చెందిన అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. భారత విమానాశ్రయాల అథారిటీ (ఎఎఐ) మరియు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు. శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుం దని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. సమిష్టి భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ యోగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పాల్గొన్న వారికి సూచించారు.