
తిరుత్తని,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 31:
తమిళనాడులోని తిరుత్తని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు బోడపాటి లోకనాథ నాయుడును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షుడు రాజగోపాల్ నాయుడు, కమ్మ సంఘం నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.