chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 8:36 am Digital Edition : CHITTOORE EXPRESS

తాగునీటి కష్టాలకు చెక్..  మోడల్ కాలనీలో బోర్ ఏర్పాటు ప్రజల్లో హర్షం 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 09:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన బోర్ ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం 11వ క్లస్టర్ ఇన్‌చార్జి కన్నన్ ఆధ్వర్యంలో బోర్ తవ్వకాలు చేపట్టగా, సుమారు నాలుగు అంగుళాల మేర నీటి ప్రవాహం లభించింది. బోర్ విజయవంతంగా పూర్తికావడంతో వెంటనే పైపులు, మోటారు అమర్చి ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. గత కొంతకాలంగా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోడల్ కాలనీ ప్రజలకు ఈ బోర్ ఏర్పాటు ఊరటనిచ్చిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల అవసరాలను గుర్తించి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. నూతన బోర్ ద్వారా కాలనీలోని కుటుంబాలకు తాగునీటి సమస్య గణనీయంగా తగ్గుతుందని స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.