chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:48 am Digital Edition : CHITTOORE EXPRESS

తల్లికి వందనంతో ప్రతి ఇంటా విద్యా వెలుగు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాసారపు. సుబ్బయ్య

శ్రీకాళహస్తి,చిత్తూర్ ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం పై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాసారపు. సుబ్బయ్య   హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు  సూపర్ సిక్స్ హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు  సమన్వయంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ. 10,120.78 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వర్తింపజేయడం గొప్ప పరిణామమని, సైబర్ మోసపూరిత ఫేక్ లింకులను నమ్మవద్దని సుబ్బయ్య  సూచించారు.