chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 10:27 am Digital Edition : CHITTOORE EXPRESS

డ్వాక్రా మహిళలకు ఆర్థికవరం ఫుడ్- బాస్కెట్ కార్యక్రమం

శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి14:

 

 

డ్వాక్రా సంఘాల్లో ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం ఒక్క వరం లాంటిదని అని రాళ్ళబూదుగూరు యూనిట్ ఇన్చార్జ్ ఆర్ఎస్.మణీ పేర్కొన్నారు. శనివారం రాళ్ళబూదుగూరు పంచాయతీ పిల్లిగాని పల్లి గ్రామంలో వెలుగు మరియు, ప్రకృతి వ్యవసాయం వారి ద్వారా ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డ్వాక్రా మహిళల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా పోషకఆహారలోపాన్ని తగ్గించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికం గా లభించే వివిధ ఆహార పదార్థాల వినియోగంతో పాటు, గ్రామీణ స్థాయిలో మెరుగైన ఆరోగ్య పోషక ఫలితాలు సాధించడానికి ఫుడ్ బాస్కెట్ ప్రముఖం గా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ ఎస్. బసవ రాజు,రాళ్ళబూదుగురు తెదేపా అధ్యక్షు డు పి జి జయరాజు,నేతలు బి.ఎం కుమార్,కలీం,రమేష్,డ్వాక్రా సంఘ మహిళలు,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.