
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:
శ్రీకాళహస్తి డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఏపీ జెన్-జెడ్ పోరాటం రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ– 2025 నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలను సమగ్రంగా విచారించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ డిమాండ్ అని, నియామకాల వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, సిద్ధాగుంట సుధాకర్ రెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు, చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గంగారి రమేష్, అత్తూరు హరి ప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య,గున్నెరి కిషోర్ రెడ్డి, రమణయ్య యాదవ్,డా. కోగల సుబ్రహ్మణ్యం, సుమతమ్మ,సాగీరా బీ,షర్మిల ఠాగూర్, సునీత సింగ్,పర్వీన్,రాజ్యలక్ష్మి, భారతమ్మ, చెంచయ్య నాయుడు, ఆర్కార్డు ముత్తు పులి రామచంద్ర, గపూర్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.